తెలంగాణ రాష్ట్రంలోని బీఈడీ, ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు నిర్వహించడానికి కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. ఎడ్‌సెట్ ద్వారా బీఈడీ కాలేజీల్లో, పీఈసెట్ ద్వారా ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీల్లో ప్రవేశాలు కల్పిస్తారు. తాజా షెడ్యూల్ ప్రకారం.. జులై 31 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభమవుతుంది. ఈ మేరకు టీజీ ఎడ్‌సెట్, టీజీ పీఈసెట్ అడ్మిషన్ల కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి విడుదల చేశారు. డీపీఎడ్, బీపీఎడ్ సీట్ల భర్తీకి ఆగస్టు 7 నుంచి పీఈసెట్ కౌన్సెలింగ్, బీఈడీ సీట్ల భర్తీకి ఆగస్టు 8 నుంచి ఎడ్‌సెట్ కౌన్సెలింగ్ ప్రారంభమవుతుంది.
ఎడ్‌సెట్‌కు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆగస్టు 8 నుంచి 20 వరకు కొనసాగుతుంది. ఆగస్టు 22, 23 తేదీల్లో వెబ్ ఆప్షన్లు, ఆగస్టు 24న ఎడిట్ ఆప్షన్స్ అందుబాటులో ఉంటుంది. తొలి దశ సీట్ల కేటాయింపు ఆగస్టు 30న విడుదల చేస్తారు. సీట్లు పొందిన అభ్యర్థులు ఆయా కాలేజీల్లో ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 4వరకు రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఇక పీఈసెట్ కౌన్సెలింగ్‌కు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆగస్టు 7 నుంచి 14 వరకు ఉంటుంది. ఆగస్టు 16, 17న వెబ్ ఆప్షన్స్, ఆగస్టు 18న ఎడిట్‌కు అవకాశం ఉంటుంది. ఆగస్టు 20న తొలిదశ సీట్ల కేటాయింపు ఉంటుంది. సీట్లు పొందిన అభ్యర్థులు ఆగస్టు 21 నుంచి 24 వరకు సంబంధిత కళాశాలల్లో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.