Fast Food : ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా తింటున్నారా? అయితే చాలా నష్టపోతారు?

-

Fast Food : ఈ రోజుల్లో చాలా మంది ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా తింటున్నారు. అందులోనూ టీనేజ్ యువత, చిన్న పిల్లలు వీటిని తినడానికి ఇష్టపడుతున్నారు. అయితే పిజ్జా, బర్గర్స్, ఫ్రైడ్ రైస్, ఫ్రైడ్ చికెన్, కూల్ డ్రింక్స్, చిప్స్ లాంటి ఫాస్ట్ ఫుడ్ లేదా అధిక జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల కచ్చితంగా తీవ్ర పరిణామాలు ఉంటాయి. అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్స్ అధికంగా ఉండే ఆహారం ఊబకాయం, టైప్ 2 డయాబెటిస్ ఇంకా గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుందని అనేక అధ్యయనాలు చూపిస్తున్నాయి. అంతేకాకుండా, ఇది మానసిక ఆరోగ్యాన్ని కూడా తీవ్రంగా దెబ్బతీస్తుంది. మన జీవితకాలాన్ని కూడా తగ్గిస్తుంది.

Fast Food
Fast Food

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం, 2022లో ప్రపంచంలోని ప్రతి 8 మందిలో కచ్చితంగా ఒకళ్ళు ఊబకాయం సమస్యతో బాధపడుతున్నారు. వీళ్ళల్లో ఎక్కువగా పిల్లలు ఇంకా యుక్తవయస్కులు అధిక బరువు సమస్యతో బాధ పడుతున్నట్లు తెలిసింది.జంక్ ఫుడ్ టీనేజర్లలో అభిజ్ఞా పనితీరును దెబ్బతీస్తుంది. షుగర్, కొవ్వు, కొలెస్ట్రాల్ మొదలైనవి కచ్చితంగా వస్తాయి.ఈ ఆహారాలు అధికంగా తినడం వల్ల టీనేజ్లో మెదడుకి సంబంధించిన సమస్యలు కచ్చితంగా వస్తాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.జంక్ ఫుడ్ నిరాశ మరియు ఆందోళన ప్రమాదాన్ని పెంచుతుంది.

యూనివర్శిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా నుండి ఇటీవలి అధ్యయనం ప్రకారం, అధిక కొవ్వు, అధిక చక్కెర కలిగిన ఆహారం దీర్ఘకాలిక మెదడు దెబ్బతినడానికి దారితీస్తుంది.ముఖ్యంగా జ్ఞాపకశక్తిని ప్రభావితం చేస్తుంది. కాబట్టి పేరెంట్స్ కచ్చితంగా పిల్లలు ఈ అలవాటు బారిన పడకుండా జాగ్రత్త పడాలి. వారికి చిన్న వయస్సు నుంచి మంచి హెల్తీ ఫుడ్స్ ని అలవాటు చెయ్యాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రతి వంటల్లో పసుపు కొంచెం వాడాలి.

తాజాగా ఉండే ఆకు కూరలు, కూరగాయలతో వంటకాలు చెయ్యాలి. అలాగే చికెన్ కి బదులుగా సాల్మన్ ఫిష్ పిల్లలకు వండి పెట్టాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పిల్లలకు పెరిగే వయసులో ఎలాంటి ఫుడ్ అలవాటు అవుతుందో ఆ ఫుడ్ నే వారు జీవితాంతం ఎక్కువగా తినడానికి ఇష్టపడతారని డాక్టర్లు తెలుపుతున్నారు. పిల్లలకు ఆకు కూరలు, సాల్మన్ ఫిష్, పాలు, పండ్లు లాంటి న్యూట్రిషన్ ఫుడ్స్ అలవాటు చెయ్యాలని నిపుణులు తెలుపుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news