తెలంగాణ ఎంప్లాయీస్ యూనియన్ నేత రాజిరెడ్డి కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే బస్సులను పెట్టీ కార్మికులను తరలించి ర్యాలీ నిర్వహించిందంటూ బాంబ్ పేల్చాడు. నెక్లెస్ రోడ్ వరకు బస్సుల్లో కార్మికులను తరలించి ర్యాలీని పోలీసు బందోబస్తుతో తీసుకువచ్చిందన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ఎందుకు ఇలా చేస్తుందో అర్దం కావడం లేదని ఆగ్రహించారు. ప్రత్యేక సెషన్ పెట్టీ బిల్లును ఆమోదింప చేయవచ్చని తెలంగాణ ఎంప్లాయీస్ యూనియన్ నేత రాజిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రెండ్రోజుల్లో ఆమోదం రావాలి అనడం సరైంది కాదన్నారు. గవర్నర్ ఆమోదించాలనే అంశంపై భిన్నాభిప్రాయాలు లేవు…చర్చలకు రమ్మని పిలిచారు వెళ్తున్నామన్నారు తెలంగాణ ఎంప్లాయీస్ యూనియన్ నేత రాజిరెడ్డి.