ఆ ఇద్దరికి ఎదురులేనట్లే..గెలుస్తారు..గెలిపిస్తారు?

-

వైసీపీలో జగన్ తర్వాత..పార్టీని గెలిపించగల సత్తా ఉన్న నాయకులు ఎవరంటే…చాలామంది కనిపిస్తారు. పార్టీ కోసం అహర్నిశలు కష్టపడుతూ..గెలుపు కోసం పనిచేస్తూ ఉంటారు. అలాంటి వారిలో విజయసాయి రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వారు ఉన్నారు. కాకపోతే వీరు బ్యాగ్రౌండ్ లో వర్క్ చేసి పార్టీని గెలిపించడానికి పనిచేస్తారు. కానీ పార్టీలో ముందు ఉంటూ నడిపించే నాయకుల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణలు ముందు వరుసలో ఉంటారు.

వీరు గెలుస్తారు..మరొకరిని గెలిపిస్తారు. ఆ సత్తా ఈ ఇద్దరికి ఉంది. ఒకప్పుడు కాంగ్రెస్ లో ఈ ఇద్దరు రాణించారు. ఇప్పుడు వైసీపీలో కూడా రాణిస్తున్నారు. ప్రస్తుతం ఇద్దరు మంత్రులుగా ఉన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వీరు మంత్రులుగా కొనసాగుతూనే ఉన్నారు. ఇక వీరి వల్ల వైసీపీకి బెనిఫిట్ ఎక్కువ ఉంది. అయితే జగన్ ఇమేజ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉంటే..వీరి ఇమేజ్ కొన్ని జిల్లాల్లో బాగా ప్రభావం చూపుతుంది.

పెద్దిరెడ్డి హవా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉంటే, బొత్సకు విజయనగరంపై పట్టు ఉంది. చంద్రబాబు సొంత జిల్లా అయిన చిత్తూరుని వైసీపీ కంచుకోటగా మార్చిన ఘనత పెద్దిరెడ్డికి ఉంది. అందుకే చంద్రబాబు..జగన్ కంటే పెద్దిరెడ్డి పైనే ఎక్కువ ఆగ్రహంగా ఉంటారు. ఆయన్నే ఎక్కువ టార్గెట్ చేస్తారు. గత ఎన్నికల్లో జిల్లాలో 14 సీట్లకు వైసీపీ 13 సీట్లు గెలుచుకుంది. ఇప్పుడు కుప్పంతో సహ 14 సీట్లు గెలుచుకోవాలని పెద్దిరెడ్డి చూస్తున్నారు. అయితే 14 కష్టం కానీ..చిత్తూరులో మాత్రం వైసీపీదే లీడ్.

ఇటు విజయనగరంలో వైసీపీ స్వీప్ చేసింది. 9కి 9 సీట్లు గెలిచేలా బొత్స సత్తా చాటారు. ఈ సారి ఇక్కడ స్వీప్ కష్టమైన..వైసీపీకి ఆధిక్యం వచ్చేలా బొత్స పనిచేస్తున్నారు. అంటే బొత్స-పెద్దిరెడ్డి గెలుస్తారు..కొన్ని సీట్లు గెలిపించగలుగుతారు.

Read more RELATED
Recommended to you

Latest news