తెలంగాణ అవతరణ ఉత్సవాల ప్రణాళిక ఇదే

-

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను జూన్‌ 2వ తేదీన ఘనంగా నిర్వహించేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఆరోజున గ్రామం నుంచి రాష్ట్రస్థాయి వరకూ అన్ని ప్రభుత్వ విభాగాల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాలని సీఎస్‌ ఎ.శాంతికుమారి ఉత్తర్వులు జారీచేశారు. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీపీలు, మేయర్లు, మున్సిపల్, జడ్పీ, డీసీసీబీ, డీసీఎంఎస్‌ ఛైర్‌పర్సన్లు, అన్ని శాఖల విభాగాధిపతులు పాల్గొనాలని కోరారు.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాల ప్రణాళిక ఇదే..

  • ఆదివారం ఉదయం గన్‌పార్క్‌లోని అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ రాష్ట్ర సాధన అమరులకు సీఎం రేవంత్‌రెడ్డి నివాళులు అర్పిస్తారు.
  • అనంతరం సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారు.
  • పరేడ్‌ గ్రౌండ్స్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం రాష్ట్ర గీతాన్ని ఆవిష్కరిస్తారు.
  • ఆ తర్వాత సీఎం సందేశం ఉంటుంది.
  • సాయంత్రం 7గంటల నుంచి రాత్రి 9గంటల వరకు ట్యాంక్‌బండ్‌పై రాష్ట్రంలోని అన్ని కళారూపాలతో పెద్ద ఎత్తున కార్నివాల్‌ ఉంటుంది.
  • శిక్షణ పొందుతున్న 5,000 మంది పోలీస్‌ అధికారులు బ్యాండ్‌తో పాల్గొంటారు.
  • 80 స్టాళ్లను ఏర్పాటు చేసి హస్తకళలు, చేనేత, స్వయం సహాయక బృందాలు తయారు చేసిన వస్తువులను ప్రదర్శనలో ఉంచుతారు.

Read more RELATED
Recommended to you

Latest news