తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. దసరాలతో పాటు క్రిస్మస్ మరియు సంక్రాంతి సెలవులను తాజాగా ప్రకటించింది కేసీఆర్ ప్రభుత్వం. దసరా పండుగ చదువులో ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం తాజాగా క్రిస్మస్ మరియు సంక్రాంతి సెలవులపై అధికారిక ప్రకటన చేసింది. దసరా, బతుకమ్మ వేడుకల సందర్భంగా 13 రోజుల దసరా సెలవులు ప్రకటించింది.
![Today is a holiday for private schools in AP](https://cdn.manalokam.com/wp-content/uploads/2023/09/Today-is-a-holiday-for-private-schools-in-AP.jpg)
ఇందులో భాగంగానే దసరా తర్వాత వచ్చే దీపావళి పండుగకు ఒక్కరోజు మాత్రమే సెలవు ఇచ్చింది. డిసెంబర్ నెలలో వచ్చే క్రిస్మస్ సెలవులను ఐదు రోజులు ఇచ్చింది. డిసెంబర్ 22వ తేదీ నుంచి 26వ తేదీ వరకు ఐదు రోజులపాటు మిషనరీ స్కూళ్లకు క్రిస్మస్ సెలవులు ఉంటాయని… ఇతర పాఠశాలలకు మాత్రం ఒక్కరోజు సెలవు ఉంటుందని ఈ ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. ఈ విద్యా సంవత్సరంలో వచ్చి మరో పెద్ద పండుగ సంక్రాంతికి ఆరు రోజుల పాటు సెలవులను ఈ చిన్న తెలంగాణ ప్రభుత్వం. భోగి సంక్రాంతి కనుమ పండుగలతో కలిపి ఆరు రోజులు సెలవులు ఇచ్చింది.