ఏపీ విద్యార్థులకు అలర్ఠ్.. దసరా పండుగకు సెలవులు ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. స్కూల్ మరియు కాలేజీలకు పండుగ సెలవులు ఖరారు చేసింది. మొత్తం 13 రోజుల పాటు దసరా సెలవులు ప్రకటించింది. అక్టోబర్ నా 14వ తేదీ నుంచి దసరా హాలిడేస్ ఉంటాయని వెల్లడించింది. అక్టోబర్ 14వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ఈ సెలవులు ఉంటాయి.
![CM Jagan met today on the final report of Gadapagadapa](https://cdn.manalokam.com/wp-content/uploads/2023/09/CM-Jagan-met-today-on-the-final-report-of-Gadapagadapa.webp)
అలాగే మిషనరీ స్కూల్ లకు 5 రోజుల పాటు క్రిస్మస్ సెలవులు ఇచ్చింది జగన్ సర్కార్. అయితే గతంలో క్రిస్మస్ సెలవులు ఏడు రోజులు ఇచ్చిన జగన్ సర్కార్ ఈసారి మాత్రం ఐదు రోజులకు తగ్గించింది. ఇక మిగతా నార్మల్ పాఠశాలలకు క్రిస్మస్ సెలవులు ఒక్క రోజు మాత్రమే ఇచ్చింది జగన్ మోహన్ రెడ్డి సర్కార్. ఇక జనవరి 12వ తేదీ నుంచి 17వ తేదీ వరకు సంక్రాంతి సెలవులను ఇచ్చింది.