వీఆర్ఓ, వీఆర్ఏ వ్యవస్థకే మొగ్గు చూపుతున్న తెలంగాణ ప్రభుత్వం..!

-

రెవెన్యూ శాఖ ప్రక్షాళనలో భాగంగా కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం వీఆర్ఏ, వీఆర్వోల వ్యవస్థను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వీఆర్వోల దగ్గర నుంచి రికార్డులు స్వాధీనం చేసుకునే పనిని కలెక్టర్లకు అప్పగించింది. కానీ ఇటీవల ఎన్నికల్లో ప్రజామోదంతో పదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోబోతుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా మళ్ళీ వీఆర్ఏ, వీఆర్వో వ్యవస్థను పునరుద్ధరించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రభుత్వ భూములను కాపాడటంలో వీఆర్వోల పాత్ర చాలా కీలకమని సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో అన్నట్టు సమాచారం.

ఈ నేపథ్యంలోనే సీఎం వ్యాఖ్యలకు బలం చేకూర్చుతూ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇకనుంచి ప్రతి గ్రామంలో ఓ రెవెన్యూ ఉద్యోగి ఉంటారని పేర్కొన్నారు. ఈ మొత్తం పరిణామాలతో రెవెన్యూ శాఖ ఉనికి కోల్పోకుండా మళ్లీ వీఆర్ఏ, వీఆర్వో వ్యవస్థను పునరుద్ధరించే అవకాశమే కనిపిస్తుందనే టాక్ వినిపిస్తోంది. ధరణి అందుబాటులోకి వచ్చిన తర్వాత వీఆర్వో, వీఆర్ఏలను గత ప్రభుత్వం ఇతర శాఖలకు కేటాయిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. అయితే ఈ నేపథ్యంలో వారినే తిరిగి విధుల్లోకి తీసుకుంటారో లేక ప్రత్యేకంగా కొత్తగా వీఆర్వోలను నియమిస్తారో అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news