Telangana : కొత్త సచివాలయంలో అగ్నిప్రమాదంపై స్పందించిన సర్కార్.. ఏం చెప్పిందంటే..?

-

రాష్ట్ర నూతన సచివాలయంలో జరిగిన అగ్ని ప్రమాదంపై సర్కార్ స్పందించింది. ఈ ప్రమాదం చాలా చిన్నపాటిదేనని, లోయర్ గ్రౌండ్ ఫ్లోర్ లోని స్టోర్ రూం మినహా ఎక్కడా నష్టం జరగలేదని చెప్పింది. ప్రారంభ ముహూర్తం సమీపిస్తున్న తరుణంలో సచివాలయ పనుల వేగవంతంపై సర్కార్ దృష్టి సారించింది. రహదార్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి నిన్న రాత్రి పనుల పురోగతిని పరిశీలించారు. రాత్రి పది గంటల వరకు సచివాలయంలో తిరిగిన మంత్రి తుది దశ పనులను ఆరా తీశారు.

మిగిలిన పనుల వేగవంతం, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయడంపై అధికారులతో చర్చించారు. లోయర్ గ్రౌండ్ ఫ్లోర్​లో జరిగిన అగ్నిప్రమాదం, ఆ ప్రభావంపై కూడా ఇంజనీర్లను అడిగి తెలుసుకున్నారు. స్టోర్ రూం మినహా మిగతా ప్రాంతాల్లో ఎక్కడా పెద్దగా నష్టం జరగలేదని చెప్పినట్లు తెలిసింది. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని మంత్రి ఇంజనీర్లు, గుత్తేదార్లకు స్పష్టం చేశారు. పనుల సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version