తెలంగాణ బడ్జెట్‌ రూ.2.50 లక్షల కోట్లు?

-

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25) బడ్జెట్‌ను వాస్తవిక అంచనాలతో రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక శాఖకు సూచించింది. ఎంతమేరకు ఆదాయం వస్తుందనేది పక్కాగా లెక్కలు వేసి అంత మేరకే కేటాయింపులతో రూపొందించాలని తెలిపింది. ఈ ఏడాది రాష్ట్ర ఆదాయం, రుణాల సేకరణ పెరుగుతున్నందున బడ్జెట్‌ రూ.2.50 లక్షల కోట్ల వరకు చేరే అవకాశాలున్నాయి. ఈ నెల 25వ తేదీన శాసనసభలో ప్రవేశపెట్టడానికి ఆర్థిక శాఖ రాష్ట్ర ప్రభుత్వ అనుమతిని అడిగినట్లు సమాచారం.

ప్రభుత్వం ఆమోదం తెలపగానే అధికారులు తేదీని అధికారికంగా ప్రకటించనున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈనెల 23వ తేదీన పార్లమెంటులో బడ్జెట్‌ ప్రవేశపెడుతోంది. ఆ వెంటనే రాష్ట్ర బడ్జెట్‌కు నిధుల కేటాయింపుపై తుది రూపు ఇవ్వనున్నారు. కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు, బహిరంగ మార్కెట్‌ నుంచి సేకరించే రుణాలు కలిపి రూ.60 వేల కోట్లకు పైగానే ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. 23న కేంద్ర బడ్జెట్‌ను జాగ్రత్తగా పరిశీలించి గ్రాంట్లపై స్పష్టమైన అవగాహన వచ్చిన తర్వాతే రాష్ట్ర ఆదాయ, వ్యయాల మొత్తాలను ఖరారు చేయాలని ఆర్థిక శాఖకు ప్రభుత్వం సూచించింది.

Read more RELATED
Recommended to you

Latest news