ఆటో డ్రైవర్లకు ఏటా రూ.12 వేలు సాయం చేస్తాం: మంత్రి శ్రీధర్‌బాబు

-

తెలంగాణ రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. ఇవాళ గవర్నర్ ప్రసంగంపై రాష్ట్ర ప్రభుత్వం ధన్యవాద తీర్మానం ప్రవేశపెట్టి చర్చ జరుపుతోంది. చర్చ అనంతరం తీర్మానానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం ఇవ్వనున్నారు. మరోవైపు ఆటో డ్రైవర్ల సమస్యలపై ప్రభుత్వ, ప్రతిపక్షాల వాడివేడి చర్చతో సభ అట్టుడుకుతోంది. మహాలక్ష్మి పథకంతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించిన ప్రభుత్వ ఆలోచనను సమర్థిస్తూనే దానివల్ల ఆటో కార్మికులు నష్టపోతున్నారని బీఆర్ఎస్ సర్కార్ దృష్టికి తీసుకెళ్లింది. మరోవైపు ఆటో కార్మికులను బీఆర్ఎస్ కావాలనే రెచ్చగొడుతోంది మంత్రి పొన్నం ఆరోపించారు.

ఈ క్రమంలో మంత్రి శ్రీధర్ బాబు జోక్యం చేసుకుంటూ ఆటో కార్మికులకు శుభవార్త చెప్పారు. ఆటో డ్రైవర్ల సంక్షేమం రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత అని చెప్పారు. వారికి ఏటా రూ.12వేలు సాయం చేస్తామని ప్రకటించారు. బడ్జెట్‌లో వారికి కేటాయింపులు చేస్తామని వెల్లడించారు. మంత్రి శ్రీధర్ బాబు ప్రకటనతో అసెంబ్లీలో ఆ సమస్యపై చర్చ ముగిసినట్టైంది.

Read more RELATED
Recommended to you

Latest news