రెవెన్యూ చట్ట సవరణపై రేవంత్ సర్కార్ సమాలోచనలు!

-

తెలంగాణలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడంపై కాంగ్రెస్ సర్కార్ కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అమల్లో ఉన్న రెవెన్యూ చట్టానికి సవరణలు తప్పవని పలువురు నిపుణులు ప్రభుత్వానికి సూచిస్తున్నట్లు సమాచారం. ధరణి పేరును భూమాతగా మార్చడానికి కూడా చట్టంలో మార్పులు తేవాల్సి ఉందని వారు  చెప్పినట్లు తెలుస్తోంది.

మరోవైపు నెల రోజులుగా భూ సమస్యలపై అధ్యయనం చేస్తున్న ధరణి కమిటీ ప్రస్తుతం అమలులో ఉన్న చట్టానికి సవరణలు తప్పవన్న నిర్ణయానికి వచ్చింది. ఈ క్రమంలో రేపటి నుంచి ప్రారంభం కానున్న శాసనసభ బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా చట్ట సవరణలకు సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి అందజేయడం, ఈ సమావేశాల్లోనే నిర్ణయం తీసుకోవడం ద్వారా ఎంత మేరకు మార్పులు తీసుకురావచ్చన్న దానిపై రెవెన్యూ అధికార వర్గాలు పరిశీలిస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో 8.90 లక్షలకు పైగా పెండింగ్‌లో ఉన్న సాదా బైనామాల క్రమబద్ధీకరణ దరఖాస్తుల పరిష్కారానికి కూడా చట్ట సవరణ చేయాల్సి ఉందని నిపుణులు ప్రభుత్వానికి సూచించినట్లు తెలిసింది.

Read more RELATED
Recommended to you

Latest news