తెలంగాణలో యంగ్‌ ఇండియా స్పోర్ట్స్‌ యూనివర్సిటీ

-

తెలంగాణలో ఫ్యూచర్ ఒలింపిక్‌ ఛాంపియన్లను సిద్ధం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో ‘యంగ్‌ ఇండియా స్పోర్ట్స్‌ యూనివర్సిటీ’ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ వర్సిటీని నిర్మించనున్నట్లు తెలిపింది. ఫ్యూచర్‌ సిటీ (ఫోర్త్‌ సిటీ)లోని స్పోర్ట్స్‌ హబ్‌లో దీన్ని ఏర్పాటు చేస్తారు.

దాదాపు 200 ఎకరాల్లో ఈ వర్సిటీని నిర్మించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇందులో డజనుకుపైగా స్పోర్ట్స్‌ అకాడమీలు వస్తాయని.. అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలతోపాటు స్పోర్ట్స్‌ సైన్స్, మెడిసిన్‌ సెంటర్లు అందుబాటులో ఉంటాయని వెల్లడించాయి. ఈ వర్సిటీకి అనువైన స్థలం కోసం హకీంపేటలోని స్పోర్ట్స్‌ స్కూల్, గచ్చిబౌలిలోని స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లను పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు.

యంగ్‌ ఇండియా స్పోర్ట్స్‌ వర్సిటీకి… కొరియన్‌ క్రీడా వర్సిటీ సాంకేతిక భాగస్వామిగా వ్యవహరించనున్నట్లు తెలిసింది. 2028లో లాస్‌ఏంజెలిస్‌లో జరగనున్న ఒలింపిక్స్‌లో మన దేశ పనితీరు మెరుగు పరిచేందుకు, తెలంగాణలో స్థాపించనున్న యంగ్‌ ఇండియా స్పోర్ట్స్‌ వర్సిటీలో ఉండాల్సిన మౌలిక వసతులపై సూచనలు ఇవ్వాలని మహీంద్రా గ్రూపు సంస్థల ఛైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రను సీఎం రేవంత్‌రెడ్డి కోరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version