రాష్ట్ర విద్యుత్ రంగ పరిస్థితిపై అసెంబ్లీలో నేడు చర్చ

-

తెలంగాణ శాసనసభ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. నాలుగు రోజుల తర్వాత బుధవారం తిరిగి ప్రారంభమైన సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రస్తుత ఆర్థిక పరిస్థితిపై శ్వేత పత్రం విడుదల చేసింది. 42 పేజీల ఈ శ్వేతపత్రంపై సభలో వాడివేడిగా చర్చ కొనసాగింది. ఇవాళ ఈ చర్చ మరింత వేడి రాజుకోనుంది. విద్యుత్ రంగంపై రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేయనుంది.

ఆయా రంగాల వారీగా శ్వేతపత్రాలు విడుదల చేయాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం నిన్న శాసనసభ వేదికగా ఆర్థికరంగంపై శ్వేతపత్రం విడుదల చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర విద్యుత్ రంగంపై స్వల్ప కాలిక చర్చలో భాగంగా శ్వేతపత్రాన్ని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సభ ముందు ఉంచనున్నారు. గత ప్రభుత్వ నిర్వాకం కారణంగా రాష్ట్ర విద్యుత్ సంస్థలు 81,516 కోట్ల రూపాయల అప్పుల్లో ఉన్నాయని మరో 50,275 కోట్ల నష్టాల్లో కూరుకుపోయాయని గవర్నర్ ప్రసంగంలో రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. అప్పులు, నష్టాలతో పాటు విద్యుత్ సరఫరా, కొనుగోళ్లు, ఉత్పత్తి, ఉత్పత్తి కేంద్రాలు సహా అన్ని అంశాలను శ్వేతపత్రంలో పొందుపరచనున్నారు. అనంతరం రాష్ట్రంలో విద్యుత్ రంగం స్థితిగతులు – శ్వేతపత్రం పై అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ జరగనుంది.

Read more RELATED
Recommended to you

Latest news