తెలంగాణ జీఎస్టీ స్కామ్ కేసు.. సీఐడీకి బదిలీ చేసిన ప్రభుత్వం

-

తెలంగాణలో మరో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే రాష్ట్ర  వాణిజ్యపన్నుల శాఖ విభాగంలో రూ. 1400 కోట్ల కుంభకోణం బయటపడింది. ఈ నేపథ్యంలో ఈ కేసును  సీఐడీకి బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపొందించి ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించే విధంగా వాణిజ్య పన్నుల శాఖ ఉన్నతాధికారులు ఐఐటీ హైదరాబాద్ ప్రొఫెసర్, ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కలసి జీఎస్టీ పన్ను ఎగవేతదారులకు సహకరించినట్టు వాణిజ్యశాఖ అధికారులు అంతర్గత ఆడిటింగ్లో గుర్తించిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో మాజీ సీఎస్ తో పాటు పలువురిపై కేసులు కూడా నమోదయ్యాయి.

ఈ స్కాంకు సంబంధించి కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ జాయింట్ కమిషనర్ రవి కానూరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్‌ సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై నగర సీసీఎస్లో ఫిర్యాదు చేయటంతో సోమేశ్ కుమార్తో సహా ఐదుగురిపై కేసు నమోదు చేశారు. 72 కంపెనీలకు ప్రయోజనం చేకూరేలా సోమేశ్ కుమార్ వ్యవహరించినట్టు అభియోగాలు నమోదయ్యాయి.  కేసు తీవ్రత దృష్ట్యా సీసీఎస్ నుంచి సీఐడీకి బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news