గుడ్ న్యూస్.. ఇంటి నిర్మాణానికి రూ.4 లక్షలు

-

ఏపీ ప్రజలకు శుభవార్త. సొంత ఇళ్ల కట్టుకోవాలనుకుంటున్న వారికి ముఖ్యమంత్రి చంద్రబాబు తీపికబురు అందించారు.  రాష్ట్ర గృహనిర్మాణ పథకాన్ని ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన (పట్టణ)-2.0 కేంద్ర ప్రభుత్వ పథకంతో అనుసంధానం చేయాలని నిర్ణయించారు. దీంతో ఇకపై కొత్తగా ఎంపిక చేసే లబ్ధిదారులకు ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.4 లక్షలు అందించనున్నారు. కేంద్ర ప్రభుత్వ వాటా 60 శాతం, రాష్ట్రప్రభుత్వ వాటా 40 శాతం ఉండనుంది.

కొత్త లబ్ధిదారుల ఎంపికపై వెంటనే సర్వే చేపట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇళ్ల స్థలాలు లేని వారికి గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు అందిస్తామని స్పష్టం చేశారు.  మరోవైపు ఈ పథకం కిందనే జర్నలిస్టులకు కూడా సరసమైన ధరలకు ఇళ్లను నిర్మించి ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశఆరు.  జర్నలిస్టులకు ప్రత్యేక కాలనీలు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇందుకు ప్రభుత్వమే స్థలాన్ని సేకరించి అందిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news