తెలంగాణకు మరో పెద్ద పరిశ్రమ రాబోతుంది. కాలిఫోర్నియాకు చెందిన బిలిటీ ఎలక్ట్రిక్ కంపెనీ.. ప్రపంచంలోనే అతి పెద్ద ఎలక్ట్రిక్ త్రీ – వీలర్ ఫ్యాక్టరీని తెలంగాణ లో స్థాపించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఆ కంపెనీ ప్రతినిధి రాహుల్ గయాం ఈ విషయాన్ని తెలిపారు. ప్రతి ఏడాది240000 ఎలక్ట్రిక్ వెహికిల్స్ ను ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా.. ఈ కంపెనీని ప్రారంభించబోతున్నట్లు రాహుల్ పేర్కొన్నారు.
ఆమెరికాకు చెందిన విద్యుత్త ఆధారిత వాహనాల తయారీ సంస్థ ఫిస్కర్,… హైదరాబాద్ లో తమ రెండో ప్రధాన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ కంపెనీ సరసన బిలిటీ ఎలక్ట్రిక్ కంపెనీ నిలవనుంది.
ఈ కొత్త ప్లాంట్ లో 150 మిలియన్ డాలర్లతో పెట్టుబడులు పెట్టబోతున్నట్లు స్పష్టం చేశారు. దాదాపు 3 వేలకు పైగా ఉద్యోగావకాశాలు లభిస్తాయని చెప్పారు. ప్రస్తుతం బిలిటీ కంపెనీ హైదరాబాద్ కు చెందిన గయాం మోటార్ వర్క్స్ తో కలిసి… త్రీవిలర్ ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తి చేయనుంది. ఇక ఈ కంపెనీకి అన్ని విధాలా సహకరిస్తామన్నారు కేటీఆర్.