మన పిల్లలు పరీక్షలు రాస్తే ఆ బాధ అర్థమవుతుంది : హైకోర్టు

-

టీఎస్‌పీఎస్సీ క్వశ్చన్ పేపర్ లీకేజీ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలంటూ ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు సోమవారం రోజున విచారణ చేపట్టింది. ఈ వ్యవహారంhై సిట్‌ గతంలో ఇచ్చిన నివేదికతో పాటు సోమవారం సమర్పించిన అనుబంధ నివేదికను పరిశీలించిన అనంతరం తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని హైకోర్టు పేర్కొంది. దర్యాప్తును మరొక సంస్థకు బదలాయించాలా.. సిట్‌లోని సభ్యులను మార్చాలా అన్న అంశంపై తగిన ఆదేశాలిస్తామని స్పష్టం చేసింది. ప్రస్తుతం దర్యాప్తులో జోక్యం చేసుకోబోమని పేర్కొంది.

టీఎస్పీఎస్సీ పరీక్షలు రాసిన అభ్యర్థుల్లో మన కుటుంబ సభ్యులు, పిల్లలు ఉంటే ఆ బాధ అర్థమవుతుందని హైకోర్టు న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. లీకేజీ, పరీక్షల వాయిదా కారణంగా అభ్యర్థులకు ఎంత ఇబ్బంది ఉంటుందో అర్థం చేసుకోవాలని అన్నారు. కష్టపడి చదివి పరీక్షలు రాశాక రద్దయితే.. తిరిగి రాయడం ఎంతో కష్టంగా ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశ్నపత్రాలు లీకైన పరీక్షలను రద్దు చేయడం సబబేనని, ఇలాంటివి జరగకుండా చూడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. నెలన్నర అయినా అసలు నిందితులను గుర్తించలేదా అని అధికారులను ప్రశ్నించారు. లీకేజీ వ్యవహారానికి బాధ్యులెవరో గుర్తించడానికి ఇంత సమయం ఎందుకన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news