తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ పి.నవీన్ రావుకు బాధ్యతలు

-

తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ పి.నవీన్ రావుకు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్ సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా నియమితులైన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే.. అత్యంత సీనియర్‌గా ఉన్న జస్టిస్ పి.నవీన్ రావుకు బాధ్యతలు హైకోర్టు సీజేగా అప్పగించారు. అయితే జస్టిస్ పి.నవీన్ రావు ఇవాళే బాధ్యతలు చేపట్టి ఈరోజు సాయంత్రమే పదవీ విరమణ చేయనున్నారు. కేవలం ఒక్కరోజు మాత్రమే ఆయన హైకోర్టు సీజేగా బాధ్యతలు నిర్వహించనున్నారు.

శనివారం నుంచి సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరిస్తారు. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అలోక్ అరధేను సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసినప్పటికీ.. రాష్ట్రపతి నుంచి నియామక ఉత్తర్వులు రావల్సి ఉంది. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కన్నెగంటి లలిత కుమారిని కర్ణాటక హైకోర్టు జడ్జిగా నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు వెలువడ్డాయి

Read more RELATED
Recommended to you

Latest news