మళ్లీ వర్షాల హెచ్చరిక నేపథ్యంలో ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు

-

తెలంగాణలో రాగల మూడ్రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది. జాతీయ విపత్తుల నిర్వహణ చట్టం కింద ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం లేదంటూ డాక్టర్‌ చెరుకు సుధాకర్‌ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆలోక్‌ అరాధే, జస్టిస్‌ టి.వినోద్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది.

ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది హరేందర్‌ పరిషద్‌ వాదనలు వినిపిస్తూ జులైలో వచ్చిన వరదల కారణంగా 49 మంది మృతి చెందారని, వారిలో 23 మంది కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం అందజేసినట్లు తెలిపారు. మిగిలిన 26 మంది వారసుల గుర్తింపు కార్యక్రమం కొనసాగుతోందని. అన్ని అంశాలతో అఫిడవిట్‌ దాఖలు చేయడానికి గడువు కోరారు.

పిటిషనర్‌ తరఫు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్‌ జోక్యం చేసుకుంటూ మళ్లీ వర్షాలు వస్తున్నట్లు హెచ్చరిక వచ్చిందని ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. వాదనలను విన్న ధర్మాసనం..  వరద బాధితులకు అందించిన సాయంపై ఈ నెల 22లోగా అఫిడవిట్‌ దాఖలు చేయాలంది. విచారణను 22వ తేదీకి వాయిదా వేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version