మావోయిస్టుల ఎన్‌కౌంటర్‌ పై హైకోర్టులో విచారణ..!

-

ములుగు జిల్లాలో నిన్న జరిగిన మావోయిస్టుల ఎన్‌ కౌంటర్‌ పై హై కోర్టులో విచారణ జరిగింది. పోలీసులు బూటకపు ఎన్‌కౌంటర్‌ చేశారని పౌరహక్కుల సంఘం తరఫు న్యాయవాది వాదించారు. భోజనంలో మత్తు పదార్థాలు కలిపి మావోయిస్టులను కస్టడీలోకి తీసుకున్నారని తెలిపారు. ఆ తర్వాత చిత్రహింసలకు గురిచేసే కాల్చి చంపారన్నారు పౌరహక్కుల సంఘం తరఫు న్యాయవాది. మావోయిస్టుల మృతదేహాలపై తీవ్ర గాయాలున్నాయన్న న్యాయవాది.. మృతదేహాలను కనీసం కుటుంబ సభ్యులకు చూపించకుండా పోస్టుమార్టం కోసం తరలించారన్నారు. ఎన్‌హెచ్‌ఆర్‌సీ నిబంధనలకు విరుద్ధంగా పోలీసులు వ్యవహరించారన్నారు న్యాయవాది.

అయితే అడవిలో పోలీసుల భద్రత దృష్ట్యా మృతదేహాలను వెంటనే ములుగు ఆస్పత్రికి తరలించామన్న ప్రభుత్వ న్యాయవాది.. కాకతీయ మెడికల్ కళాశాలకు చెందిన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో పోస్టుమార్టం నిర్వహించారన్నారు. ఈ ప్రక్రియను మొత్తం వీడియో తీశారన్నారు ప్రభుత్వ న్యాయవాది. అయితే మృతదేహాలను రేపటి వరకు భద్రపర్చాలని పోలీసులకు హైకోర్టు ఆదేశం ఇచ్చింది. మృతదేహాలను కుటుంబ సభ్యులకు, బంధువులకు చూపించాలని పేర్కొన్న కోర్టు.. తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version