సంగారెడ్డి కారులో పోటీ.. జగ్గారెడ్డికి చెక్ పెట్టేదెవరు?

-

ఉమ్మడి మెదక్ జిల్లా సంగారెడ్డి నియోజకవర్గం… కాంగ్రెస్ కంచుకోట..ఇక్కడ కాంగ్రెస్ నుంచి జగ్గారెడ్డి సత్తా చాటుతున్నారు. అయితే ఈ సారి జగ్గారెడ్డికి చెక్ పెట్టాలని చెప్పి బి‌ఆర్‌ఎస్ గట్టిగానే కష్టపడుతుంది. అలాగే బలమైన అభ్యర్ధిని రెడీ చేసే ప్రయత్నాలు చేస్తుంది. సంగారెడ్డిలో బి‌ఆర్‌ఎస్ పార్టీకి కూడా బలం ఉంది. ఇక్కడ రెండు సార్లు గెలిచింది. 2004లో జగ్గారెడ్డి బి‌ఆర్‌ఎస్ నుంచే గెలిచారు. తర్వాత కాంగ్రెస్ లోకి జంప్ చేశారు.

2009లో కాంగ్రెస్ నుంచి జగ్గారెడ్డి గెలిచారు. తెలంగాణ వచ్చాక 2014 ఎన్నికల్లో జగ్గారెడ్డికి బి‌ఆర్‌ఎస్ చెక్ పెట్టింది. బి‌ఆర్‌ఎస్ నుంచి చింతా ప్రభాకర్ విజయం సాధించారు. అయితే 2018 ఎన్నికల్లో సీన్ రివర్స్ అయింది. మళ్ళీ జగ్గారెడ్డి గెలిచారు. ఇక జగ్గారెడ్డి దూకుడుగా పనిచేసుకుంటూ వెళుతున్నారు. అలాగే కే‌టి‌ఆర్ తో సఖ్యత ఉండటం కారణంగా కావల్సిన పనులు చేయించుకుంటున్నారు. ఈయనకు కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డితో విభేదాలు ఉన్నాయి. దీంతో ఇటీవల కాంగ్రెస్ లో సైలెంట్ గా ఉంటున్నారు. ఈ క్రమంలో ఆయన పార్టీ మారిపోతారనే ప్రచారం వస్తుంది.

కానీ అందులో వాస్తవం లేదని జగ్గారెడ్డి అనుచరులు అంటున్నారు. మళ్ళీ ఆయన కాంగ్రెస్ నుంచే బరిలో ఉంటారని చెబుతున్నారు. జగ్గారెడ్డి విషయం పక్కన పెడితే..అటు బి‌ఆర్‌ఎస్ లో సీటు కోసం పోటీ నెలకొంది. ఓ వైపు మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సీటు కోసం గట్టిగానే ట్రై చేస్తున్నారు. ఈయనకు పోటీగా డాక్టర్ శ్రీహరి సైతం సీటు ఆశిస్తున్నారు. ఈయన తాజాగా మంత్రి హరీష్ రావుకు తన సొంత సామాజికవర్గం..గొల్ల, కురుమలని వెంటబెట్టుకుని సీటు ఇవ్వాలని కోరారు. హరీష్ సైతం..సి‌ఎం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.  ఇలా ఇద్దరు నేతలు సీటు కోసం పోటీ పడుతున్నారు. అలా కాకుండా జగ్గారెడ్డి  బి‌ఆర్‌ఎస్ లోకి వస్తే సీన్ మారుతుంది. ఎన్నికల వరకు సంగారెడ్డి బరిలో ఎవరు ఉంటారో క్లారిటీ రాదనే చెప్పాలి.

Read more RELATED
Recommended to you

Latest news