BIG BREAKING : తెలంగాణలో గ్రూప్-1 నియామకాలకు బ్రేక్

-

తెలంగాణలో గ్రూప్-1 రాసి క్వాలిఫై అయిన అభ్యర్థులకు హైకోర్టు షాక్ ఇచ్చింది. త్వరలోనే గ్రూప్-1 నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిన వేళ ఉన్నత న్యాయస్థానం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. గ్రూప్-1 నియామకాలు తాత్కాలికంగా నిలిపివేయాలని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారులకు సూచించింది. విచారణ పూర్తయ్యే వరకు గ్రూప్‌-1కు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వొద్దని ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ మాత్రం కొనసాగించొచ్చని న్యాయస్థానం స్పష్టం చేసింది.

రాష్ట్రంలో గత కొంతకాలంగా గ్రూప్-1 పరీక్షల ఫలితాలపై తీవ్ర దుమారం రేగుతున్న విషయం తెలిసిందే. ఈ పరీక్షల్లో చాలా మందికి ఒకే రకంగా మార్కులు రావడం సర్వత్రా చర్చనీయాంశమైంది. దీనిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సహా ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు కీలక ఆరోపణలు కూడా చేశారు. గ్రూప్-1 పరీక్షల్లో  భారీ కుంభకోణం జరిగిందంటూ ఆరోపించారు. దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారం కాస్తా హైకోర్టుకు చేరడంతో గ్రూప్-1 నియామకాలకు బ్రేక్ పడింది.

Read more RELATED
Recommended to you

Latest news