Telangana Income: తలసరి ఆదాయంలో మరోసారి తెలంగాణ టాప్ లో నిలిచింది. దేశంలోనే అత్యధికంగా తెలంగాణలో తలసరి ఆదాయంలో రూ.2.75 లక్షలు ఉందని స్టాండర్డ్ చార్టెర్డ్ బ్యాంక్ నివేదిక వెల్లడించింది. ఆ తర్వాత కర్ణాటక (రూ. 2.65 లక్షలు), తమిళనాడు (రూ. 2.41 లక్షలు), కేరళ (రూ. 2.30 లక్షలు), ఏపీ (రూ. 2.07 లక్షలు) ఉన్నాయి. 2030 నాటికి తలసరి ఆదాయంలో గుజరాత్ అగ్రస్థానానికి చేరుతుందని అంచనా వేసింది.
అప్పటికి దేశ ప్రజల తలసరి ఆదాయం 3.28 లక్షలు చేరుతుందని పేర్కొంది. కాగా, ఇవాళ తెలంగాణ కేబినేట్ సమావేశం జరుగనుంది. ఇవాళ అంటే సోమవారం నాడు మధ్యాహ్నాం 2 గంటల నుంచి డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ రాష్ట్ర కేబినేట్ సమావేశాన్ని నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ సందర్భంగా.. దాదాపు 40 నుంచి 50 అంశాల మీద తెలంగాణ రాష్ట్ర కేబినేట్ చర్చించనున్నది.