BRS చీఫ్, సీఎం కేసీఆర్ మంగళవారం మహారాష్ట్ర పర్యటనకు వెళ్ళనున్నారు. మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో ఏర్పాటు చేసే దళిత నేత అన్న బావ్ సాటే జయంతి ఉత్సవాల్లో కేసీఆర్ పాల్గొననున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
సాంగ్లీ జిల్లా బీఆర్ఎస్ పార్టీ ప్రముఖులతో సమావేశం అవుతారని పేర్కొన్నాయి. ఆ తర్వాత కోల్హాపూర్ లోని మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా, దేశంలోనే అత్యధికంగా తెలంగాణలో తలసరి ఆదాయంలో రూ.2.75 లక్షలు ఉందని స్టాండర్డ్ చార్టెర్డ్ బ్యాంక్ నివేదిక వెల్లడించింది. ఆ తర్వాత కర్ణాటక (రూ. 2.65 లక్షలు), తమిళనాడు (రూ. 2.41 లక్షలు), కేరళ (రూ. 2.30 లక్షలు), ఏపీ (రూ. 2.07 లక్షలు) ఉన్నాయి. 2030 నాటికి తలసరి ఆదాయంలో గుజరాత్ అగ్రస్థానానికి చేరుతుందని అంచనా వేసింది. అప్పటికి దేశ ప్రజల తలసరి ఆదాయం 3.28 లక్షలు చేరుతుందని పేర్కొంది.