Telangana: తెలంగాణ ఇంటర్ సప్లమెంటరీ పరీక్షలు తేదీ ఖరారు.. ఎప్పుడంటే ?

-

తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల అయ్యాయి. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ ఫలితాలను విడుదల చేశారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. మే 22 నుంచి ఇంటర్ సప్లమెంటరీ పరీక్షలు ఉంటాయని ఈ సందర్బంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం వారం రోజుల గడువు పెట్టింది.

తెలంగాణ ఇంటర్‌ పరీక్షలు రాసినవారు 9.97 లక్షల మంది విద్యార్థులు.. ఇంటర్‌ సెకండియర్‌లో 71.37 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఫస్టియర్‌లో 66.89 శాతం ఉత్తీర్ణత సాధించారు. గతం కన్నా ఉత్తీర్ణత శాతం పెరిగింది.. ఈ సారి కూడా బాలికలదే హవా కొనసాగింది.  కాగా మార్చి 05 నుంచి 25వ తేదీ వరకు పరీక్షలు జరిగాయి.

Read more RELATED
Recommended to you

Latest news