తెలంగాణలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు అలర్ట్. ప్రథమ, ద్వితీయ సంవత్సరం అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు ఈరోజు (జూన్ 24వ తేదీ 2024) మధ్యాహ్నం 2 గంటలకు విడుదల చేయనున్నట్లు రాష్ట్ర ఇంటర్ విద్యామండలి వెల్లడించింది. మే, జూన్ నెలల్లో జరిగిన సప్లిమెంటరీ పరీక్షలకు 4.5 లక్షల మంది విద్యార్థులు హాజరైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఈ పరీక్షల ఫలితాలు ఇవాళ విడుదల చేస్తున్నారు. ఫలితాలు విడుదలైన కాసేపటికి విద్యార్థులు ఈ వెబ్ సైట్లలో ఫలితాలు చెక్ చేసుకోవచ్చని రాష్ట్ర ఇంటర్ విద్యామండలి వెల్లడించింది. ఫలితాల కోసం ఈ వెబ్ సైట్లు క్లిక్ చేయండి. http://tgbie.cgg.gov.in, http://results.cgg.gov.in
మరోవైపు రాష్ట్ర సంక్షేమ గురుకులాల్లో అధ్యాపక, ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో దివ్యాంగ అభ్యర్థుల ఫలితాలు సోమవారం విడుదల చేయనున్నట్లు గురుకుల నియామక బోర్డు వెల్లడించింది. దివ్యాంగ అభ్యర్థులకు నిర్వహించిన వైద్యపరీక్షల నివేదికలు బోర్డుకు చేరడంతో పరిశీలించిన గురుకుల నియామక సంస్థ ప్రాథమిక ఎంపిక జాబితాను ఈరోజు ప్రకటించనుంది. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ధ్రువీకరణ పత్రాల పరిశీలన ఉంటుందని తెలిపింది.