బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సొనాక్షి సిన్హా బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెప్పింది. తన బాయ్ ఫ్రెండ్ జహీర్ ఇక్బాల్‌ను (జూన్ 23)న వివాహం చేసుకుంది. గత ఏడేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట బంధువులు, అతికొద్ది మంది సమక్షంలో ఇంట్లోనే సింపుల్ గా వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఈ విషయాన్ని సోనాక్షి సోషల్ మీడియా వేదికగా షేర్ చేసి తమ పెళ్లి ఫొటోలను అభిమానులతో పంచుకుంది. ఈ ఫొటోల కింద సోనా బ్యూటీఫుల్ క్యాప్షన్ రాసుకొచ్చింది.
“ఏడేళ్ల క్రితం ఇదే రోజున కలిశాం. ఒకరినొకరం చూసుకున్నాం. అదే రోజున ఫిక్స్ అయ్యాం ఆ ప్రేమే మాకు దిక్సూచిలా మారింది. నడిపించింది కూడా. ఎన్నో ఒడుదొడుకులు వచ్చినా మా ప్రేమే మాకు తోడుగా నిలిచింది. మా ఇరు కుటుంబాల ప్రేమ, ఆశీర్వాదాలతో ఇప్పుడు మేం ఒక్కటయ్యాం. ఇప్పుడు మేం భార్యా భర్తలం” అంటూ తమ పెళ్లి ఫొటోలను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.