ఐటీ రంగ ప్రగతిపై నేడు నివేదిక విడుదల చేయనున్న మంత్రి కేటీఆర్‌

-

తెలంగాణ సాధించుకున్న తర్వాత రాష్ట్రం ఐటీ రంగంలో దినదినాభివృద్ధి చెందుతున్న విషయం తెలిసిందే. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సారధ్యంలో దేశానికి హైదరాబాద్‌ ఐటీ హబ్‌గా మారింది. ఈ నేపథ్యంలో ఆ శాఖ మంత్రి కేటీఆర్ ఈరోజున తెలంగాణ రాష్ట్రంలో ఐటీ రంగం 2022-23 ఏడాదిలో సాధించిన ప్రగతికి సంబంధించి నివేదిక విడుదల చేయనున్నారు. ఈ నివేదిక ఐటీ రంగం విజయాలతో పాటు కొత్త ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ప్రాధాన్యతలు, లక్ష్యాలనూ వివరిస్తాయి.

ఐటీ రంగం ఎగుమతులతో పాటు, ఉద్యోగ కల్పలో గణనీయ వృద్ధిని సాధించినట్లు గత నివేదికలు వెల్లడిస్తున్నాయి. మంత్రి కేటీఆర్ గత నెల పర్యటన ద్వారా 42 వేల మందికి ఉపాధి కల్పించే పెట్టుబడులు వచ్చినట్లు తెలుస్తోంది. కేటీఆర్ యూకే, యూఎస్ పర్యటనలో రాష్ట్రానికి లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ప్రముఖ దిగ్గజ పర్యాటక సంస్థ మాండీ హోల్డింగ్స్‌, దిగ్గజ సంస్థ అమర రాజా, ప్రముఖ గ్లోబల్‌ సప్లై చైన్‌.. టెక్‌జెన్స్‌ , డిజిటల్‌ సొల్యూషన్స్‌ రంగంలో అగ్రగామి అయిన రైట్‌ సాఫ్ట్‌వేర్‌ సంస్థ, ప్రముఖ గేర్ల ఉత్పత్రి సంస్థ రేవ్‌గెర్స్‌ హైదరాబాద్​లో తమ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version