ఎన్నికల వేళ రాష్ట్రంలో తగ్గిన మద్యం అమ్మకాలు.. అక్రమ సరఫరా జరుగుతోందని అనుమానాలు

-

ఎన్నికల వేళ తెలంగాణలో మద్యం అమ్మకాలు జోరుగా సాగడం కామన్. కానీ ఈసారి మాత్రం అందుకు విరుద్ధంగా పరిస్థితులు ఉన్నాయి. ఇది అబ్కారీ శాఖ అధికారులను కూడా కాస్త ఆశ్చర్యానికి గురి చేస్తోంది. లిక్కర్‌ 90ఎంఎల్ బాటిల్‌పై 10 రూపాయలు తగ్గించినా మద్యం అమ్మకాలు ఊపందుకోకపోవడంపై అనుమానాలు తావిస్తున్నాయని అధికారులు భావిస్తున్నారు.

ఎన్నికల వేళ ఇలా జరగడంపై అబ్కారీ శాఖ అనుమానం వ్యక్తం చేస్తోంది. అక్రమంగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయేమోనని భావిస్తోంది. ఆ దిశగా కట్టడి చర్యలకు ఉపక్రమించింది. గత నెల 9వ తేదీ నుంచి ఈ నెల 18వ తేదీ వరకు 3కోట్ల 850 లక్షల విలువ చేసే 38 లక్షల 66వేల లిక్కర్‌ కేసులు , 56 లక్షల 76 వేల బీర్లు అమ్ముడు పోయినట్లు తెలుస్తోంది. నలభై రోజుల్లో కేవలం 3 వందల80 కోట్ల రూపాయల విలువైన మద్యం మాత్రమే అదనంగా అమ్ముడు పోయినట్లు సమాచారం.

ఎన్నికల్లో మద్యం పెద్ద ఎత్తున వాడకం జరుగుతున్నా ఆశించినంత విక్రయాలు పెరగకపోవడంపై అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అబ్కారీ శాఖ పెద్ద ఎత్తున తనిఖీలు చేసినా. స్థానిక నాయకులతో ఉన్న పరిచయాలతో చూసీ చూడనట్లు వదిలేస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో తక్షణమే నిఘా పెంచి బెల్టు దుకాణాలను రద్దు చేయడంతో పాటు… బయట రాష్ట్రాల నుంచి నాన్‌ డ్యూటీ పెయిడ్‌ మద్యం సరఫరా రాకుండా చూడాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news