నేడు తెలంగాణ మొదటి సీఎం, బీఆర్‌ఎస్ పార్టీ చీఫ్ కేసీఆర్ పుట్టిన రోజు అన్న సంగతి తెలిసిందే. దీంతో.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా… కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు నిర్వహిస్తున్నారు. మొక్కలు నాటడం… ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు బీఆర్‌ఎస్ పార్టీ నేతలు. అయితే.. ఈ తరుణంలోనే… బీఆర్‌ఎస్ పార్టీ చీఫ్ కేసీఆర్ కు తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ శుభాకాంక్షలు తెలిపారు.

గజ్వేల్ శాసనసభ్యులు గౌరవనీయులైన శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు. మీరు ఆరోగ్యంగా, సుఖశాంతులతో దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నాను అంటూ కాంగ్రెస్ పార్టీలోనే ఎవరూ రియాక్ట్ కాకముందే.. మొదటగా కేసీఆర్ కు తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ శుభాకాంక్షలు తెలిపారు.
గజ్వేల్ శాసనసభ్యులు గౌరవనీయులైన శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఆరోగ్యంగా, సుఖశాంతులతో దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నాను!@KCRBRSPresident pic.twitter.com/gbpCpEWq7S
— Ponnam Prabhakar (@Ponnam_INC) February 17, 2025