నిజమాబాద్ జిల్లా కేంద్రంలో స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో పాల్గొన్నారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహాత్ముల వీరోచిత పోరాటం,వారి త్యాగ ఫలమే దేశానికి స్వాతంత్రమని అన్నారు. మహనీయుల పోరాట స్ఫూర్తిని గుర్తు చేసుకునేందుకే ఈ 15 రోజుల వేడుకలని తెలిపారు. 15 రోజుల పాటు రోజుకు ఒక కార్యక్రమం అధికారికంగా నిర్వహించటం అనందకరమని అన్నారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. తెలంగాణ ఉద్యమం కూడా స్వత్యంత్ర పోరాటంతో సమానమని అన్నారు.
గ్రామ స్వరాజ్యం అనుకూలంగా పల్లెప్రగతితో గ్రామాల అభివృద్ధికి కృషి చేసి,బాపు జి కలలు గన్న నిజమైన స్వరాజ్యం సాకారం చేసిన ఘనత సీఎం కేసీఆర్ దేనని అన్నారు. కేంద్రం ప్రకటించిన ఆదర్శ గ్రామాల్లో జిల్లా నుండి 4 గ్రామాలు దేశంలోనే ముందువరుసలో ఉండటం గర్వకారణమని..ఇది నిజమైన స్వాతంత్య్రమన్నారు. జండా పంపిణీ కార్యక్రమాన్ని బాద్యతయుతంగా నిర్వహించాలని అధికారులను కోరుతున్నానన్నారు. ఈనెల 15న 9 గంటలకు ప్రతి పల్లెలో ప్రతి ఇంటిపై మన త్రివర్ణ జండా ఎగరవేయాలని పిలుపునిచ్చారు.