ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌..నేటి నుంచి రోడ్డెక్కనున్న 80 కొత్త ఆర్టీసీ బస్సులు

-

తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం వల్ల పెరిగిన రద్దీకి అనుగుణంగా టీఎస్ఆర్టీసీ సంస్థ బస్సుల సంఖ్య పెంచుతోంది. రూ. 400 కోట్లతో 1,050 బస్సులను కొనుగోలు చేయనుంది. ఇందులో 80 కొత్త బస్సులు ఈరోజు ప్రారంభం కానున్నాయి. వీటిని అంబేద్కర్ విగ్రహం వద్ద రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభిస్తారు.

Telangana New buses start today

కొత్త బస్సుల్లో 30 ఎక్స్ప్రెస్, 30 రాజధాని ఏసీ, 20 లహరి స్లీపర్ కమ్ సీటర్ (నాన్ ఏసీ) ఉన్నాయి. కాగా, ఈ ఆర్థిక సంవత్సరానికి గాను రూ.400 కోట్ల వ్యయంతో అధునాతనమైన 1050 కొత్త డీజిల్ బస్సులను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఈ బస్సులన్నీ విడతల వారీగా 2024 మార్చి నాటికి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకువచ్చేలా సంస్థ ప్లాన్ చేసింది. మహాలక్ష్మి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం స్కీమ్ వల్ల పెరిగిన రద్దీకి అనుగుణంగా ఈ కొత్త బస్సులను వినియోగించుకోనుంది.

Read more RELATED
Recommended to you

Latest news