అయోధ్యలో ఇవాళ మరో అద్భుత ఘట్టం ఆవిష్కారం కానుంది. ప్రధాని మోదీ ఈరోజు అయోధ్యలో పర్యటించుకున్నారు. రూ. 15,000 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. దీంతో టెంపుల్ టౌన్ అయోధ్యలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

ఈ పర్యటనలో మోదీ….మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం, అయోధ్య దామ్ రైల్వే స్టేషన్, 2 అమృత్ భారత్ రైళ్లు, 6 వందే భారత్ రైళ్లను ప్రారంభిస్తారు. వచ్చే నెల 22న అయోధ్యలో శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్టించనున్న సంగతి తెలిసిందే.