రాత్రి వేళ మహిళలకు ఫ్రీ జర్నీ అంటూ జరుగుతున్న ప్రచారం పై పోలీసులు స్పందించారు. అయితే రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య పోలీసులకు ఫోన్ చేస్తే.. వారు వచ్చి మహిళలను ఇంటివద్ద ఉచితంగా దించుతారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ ఫేక్ ప్రచారం పై హైదరాబాద్ పోలీసులు క్లారిటీ ఇచ్చారు.
అయితే మహిళల రక్షణ కోసం టీ సేఫ్ పేరిట ప్రభుత్వం యాప్ ను లంచ్ చేసిన విషయం తెలిసిందే. ఇందులో మహిళల ప్రయాణాన్ని పోలీసులు ట్రాక్ చేస్తూ ఉంటారు. కానీ రాత్రి వేళలో 1091, 7837018555 నంబర్ కి ఫోన్ చేస్తే స్థానిక పోలీసుల వాహనం వచ్చి తీసుకెళ్తుంది అని కొందరు వాట్సాప్ లో ప్రచారం చేస్తున్నారు. ఈ మెసేజ్ తో తప్పుదోవ పట్టిస్తున్నారని, ఉచిత రవాణా సౌకర్యం పేరిట తప్పుడు ప్రచారం జరుగుతోందని పోలీసులు స్పష్టం చేసారు. ఇలాంటి పుకార్లు ఎవరూ నమ్మవద్దని పోలీసులు పేర్కొన్నారు.