ఫోన్ ట్యాపింగ్‌ వెనక రాజకీయ ప్రముఖులు!

-

తెలంగాణలో ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో రోజుకో కీలక మలుపు చోటుచేసుకుంటోంది. ఈ వ్యవహారం వెనక పలువురు కీలక ప్రముఖులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అధికారులే కాకుండా గత సర్కార్ లో కీలకంగా వ్యవహరించిన పలువురు రాజకీయ నేతల ప్రమేయం కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఉన్నతస్థాయి నుంచి వచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ప్రణీత్‌ రావు బృందం ఈ వ్యవహారం నడిపినట్లు వెల్లడించారు. సున్నితమైన అంశం కావడంతో మరింత లోతుగా ఆరా తీసి పకడ్బందీ ఆధారాలతో కేసును బలోపేతం చేయాలని నిర్ణయించారు.

స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌(ఎస్‌ఐబీ) డీఎస్పీగా పనిచేసి సస్పెండైన దుగ్యాల ప్రణీత్‌రావు ప్రధాన నిందితుడిగా ఉన్న ఈ కేసులో ఇప్పటివరకు అతడితోపాటు అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నను అరెస్టు చేశారు. పక్కా ఆధారాలతో మరికొందరిని అరెస్టు చేయనున్నారు. ఈ జాబితాలో ప్రముఖ రాజకీయ నేతలతోపాటు విశ్రాంత, ప్రస్తుత పోలీస్‌ అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ముగ్గురు నిందితుల నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు మంగళవారం న్యాయస్థానంలో కస్టడీ పిటిషన్‌ దాఖలు చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news