ఒంటిగంట వరకు 36.68 శాతం పోలింగ్‌ నమోదు

-

రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల పండుగ వాతావరణం నెలకొంది. ప్రజలు ఉదయం నుంచే పోలింగ్‌ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ప్రముఖులు కూడా సామాన్యులతో కలిసి క్యూలైన్లలో నిలబడి ఓటు వేశారు. ప్రతి పౌరుడు ఎన్నికల పండుగలో పాల్గొని తమ ఓటు హక్కుని వినియోగించుకోవాలని పిలుపునిస్తున్నారు.

ఇవాళ మధ్యాహ్నం 1 గంట వరకు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 36.68శాతం పోలింగ్‌ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. మెదక్‌ జిల్లాలో అత్యధికంగా 50.80శాతం, అత్యల్పంగా హైదరాబాద్‌లో 20.79 శాతం పోలింగ్‌ నమోదైంది. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పలుచోట్ల చెదురుమొదురు సంఘటనలు చోటుచేసుకున్నాయి. అధికార బీఆర్ఎస్, విపక్ష నేతలు ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడుతున్నారు. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారకుండా చర్యలు తీసుకుంటున్నారు. పోలింగ్ కేంద్రాల మధ్య అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు.

మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయని సీఈవో వికాస్ రాజ్ తెలిపారు. ఒకటి, రెండు చోట్ల ఈవీఎంలు మార్చారని చెప్పారు. ఓటర్ల నుంచి మంచి స్పందన ఉందని వెల్లడించారు

Read more RELATED
Recommended to you

Latest news