గులాబీ కండువాతో పోలింగ్‌ కేంద్రానికి బీఆర్ఎస్ నేతలు

-

హుజూర్‌నగర్‌లో గులాబీ కండువాతో ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి పోలింగ్‌ కేంద్రానికి వెళ్లారు. గులాబీ కండువా తీయాలని సైదిరెడ్డికి సీఐ రవి కుమార్ సూచించారు. అయినా ఆయన కండువా తీయకుండా.. అది పార్టీ కండువా కాదని.. చేతి రుమాలని సమర్థించుకున్నారు. ఈ క్రమంలోనే సైదిరెడ్డి, సి.ఐ. రవికుమార్‌ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. సైదిరెడ్డి వినకపోవడంతో సి.ఐ. రవికుమార్‌ వెనక్కితగ్గారు. గులాబీ కండువాతోనే సైదిరెడ్డి పోలింగ్‌ కేంద్రాన్ని పరిశీలించడం గమనార్హం.

- Advertisement -

మరోచోట కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు. బీఆర్ఎస్ పార్టీ కండువాతో ఆయన పోలింగ్ కేంద్రానికి వెళ్లారు. నెన్నెల మండలం జెండా వెంకటపూర్‌లో ఎమ్మెల్యే ఓటు హక్కు వినియోగించుకునేందుకు దుర్గం చిన్నయ్య గులాబీ కండువా మెడలో వేసుకుని వెళ్లారు. అయితే ఆయన అలా పోలింగ్‌ కేంద్రానికి వెళ్లడంపై ఎన్నికల సిబ్బంది అభ్యంతరం చెప్పకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. అధికార పార్టీ నేతలు నిబంధనలు ఉల్లంఘించినా అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారని విపక్ష నేతలు మండిపడుతున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...