తెలంగాణ ఆచరిస్తుంది.. దేశం అనుసరిస్తుంది – హరీష్ రావు

-

రాష్ట్రంలో 9 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఎంబిబిఎస్ తరగతులను ప్రగతి భవన్ నుండి వర్చువల్ గా ప్రారంబించారు సీఎం కేసీఆర్. ఈ సందర్భంగా ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. ఈరోజు రాష్ట్ర చరిత్రలో సుదినం అన్నారు. ఒక రాష్ట్రం ఒకేసారి 9 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రారంభించడం దేశ వైద్య రంగ చరిత్రలోనే మొదటిసారని తెలిపారు. ఇది సీఎం కేసిఆర్ పట్టుదలకు నిదర్శనం అన్నారు మంత్రి హరీష్ రావు.

రాష్ట్రంలో పేదలకు విద్య, వైద్యం అందుబాటులోకి రావాలని ఆయన మార్గ నిర్దేశంలో ఇంత గొప్ప విజయాన్ని సాధించామన్నారు. గత సంవత్సరం 8 కాలేజీలు ప్రారంభించి తెలంగాణ కొత్త రికార్డు సృష్టించిందని.. ఈ సంవత్సరం మన రికార్డును మనమే అధిగమించామన్నారు. ఈ ఏడాది దేశ వ్యాప్తంగా ప్రభుత్వ రంగంలో అందుబాటులోకి వచ్చిన ఎంబీబీఎస్ సీట్లలో తెలంగాణ వాటా 43 శాతం అన్నారు. ఇది గొప్ప రికార్డు అని.. దేశంలోని మిగితా 27 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కలిపి 57 శాతం సీట్లు మాత్రమే అందుబాటులోకి తెచ్చాయన్నారు.

మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, 24 గంటల విద్యుత్తు సరఫరా, జిల్లాకో మెడికల్ కాలేజీ, రైతుబంధు వంటి కార్యక్రమాలతో మన రాష్ట్రం దేశానికే దిక్సూచిగా నిలిచిందన్నారు. ఒకప్పుడు బెంగాల్ ఆలోచిస్తుంది.. దేశం అచరిస్తుంది అనే నానుడి ఉండేదని.. దాన్ని తిరగరాసిన ఘనత సీఎం కేసిఆర్ దేనని అన్నారు. ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ అని సీఎం కేసీఆర్ సంకల్పిస్తే.. దేశం మొత్తం అదే దారిలో నడుస్తుందన్నారు. ఇప్పుడు తెలంగాణ అచరిస్తుంది.. దేశం అనుసరిస్తుంది అన్నంత గొప్పగా రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ ముందుకు తీసుకు వెళుతున్నారని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news