జనవరిలో రామాయపట్నం పోర్టు ప్రారంభం కానుంది. డిసెంబర్ నాటికి రామాయపట్నం పోర్టు పనుల్ని పోటీ చేసే జనవరిలో సీఎం చేతుల మీదుగా ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నామని APIIC ఎండి ప్రవీణ్ కుమార్ తెలిపారు.
దేశంలో ఎక్కడా లేనివిధంగా సుమారు రూ. 20 వేల కోట్లతో నాలుగు పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు నిర్మిస్తున్నట్లు చెప్పారు. అటు తొలిదశ పనులు చేపట్టిన జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ ఫిషింగ్ హార్బర్లను ఈ ఏడాదే ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.
కాగా, వైద్య శాఖలో 2018కి ముందు నియమితులైన కాంట్రాక్ట్ ఉద్యోగులకు 100% గ్రాస్ వేతనాన్ని (పే+HRA+DA) చెల్లించేలా ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో 3,914 మందికి లబ్ధి చేకూరుతుందని పారా మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు రత్నాకర్ వెల్లడించారు. కేడర్ను బట్టి రూ. 10,000 నుంచి రూ. 15000 వరకు జీతాలు పెరుగుతాయన్నారు. కాగా, గత ప్రభుత్వ హయాంలో 100% గ్రాస్ వేతనం స్థానంలో ‘కన్సాలి డేట్ పే’ చెల్లించేవారు.