తెలంగాణ ప్రజలకు చల్లటి కబురు చెప్పింది వాతావరణ శాఖ. తెలంగాణ రాష్ట్రంలో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు తగ్గాయి. చాలా చోట్ల సాధారణం కంటే 2 నుంచి 5 డిగ్రీల మేర తగ్గుదలకు వచ్చాయి. ముఖ్యంగా ఆదిలాబాద్‌లో ఏకంగా 9.6 డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదు అయ్యాయి ఉష్ణోగ్రతలు.
అటు సరిహద్దులో ఉపరితల ద్రోణి, ఉపరితల ఆవర్తన ప్రభావం ఉండటంతో… తెలంగాణ రాష్ట్రంలో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు తగ్గాయని చెబుతున్నారు. దీంతో ఇవాళ, శనివారాల్లో అక్కడక్కడా తేలికపాటి వానలు కురిసే చాన్స్ ఉన్నట్లు తెలంగాణ ప్రజలకు చల్లటి కబురు చెప్పింది వాతావరణ శాఖ.