తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్..ఈ జిల్లాల్లో మళ్లీ వర్షాలు

-

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అదిరిపోయే శుభవార్త అందింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో విపరీతంగా ఎండలు కొడుతున్న సంగతి తెలిసిందే. దీంతో జనాలు బయటికి రావడానికి భయపడిపోతున్నారు. ఈ నేపథ్యంలో చల్లటి కబురు చెప్పింది హైదరాబాద్ వాతావరణ శాఖ. తెలంగాణలోని పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

అదిలాబాద్, అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల మరియు కరీంనగర్ లాంటి ప్రాంతాలలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ స్పష్టం చేసింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో వర్షాలు పడతాయని కూడా స్పష్టం చేసింది వాతావరణ శాఖ. కొన్నిచోట్ల వేడి మరియు తేమతో కూడిన పరిస్థితులు ఉంటాయని వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Latest news