ఇవాళ్టి నుంచి 3 రోజుల పాటు తెలంగాణకు భారీ వర్షాలు!

-

తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్. ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడనున్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ స్పష్టం చేసింది. తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 18 మరియు 19 తేదీలలో ఉరుములు మరియు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ కూడా జారీచేసింది వాతావరణ శాఖ.

వచ్చే రెండు రోజులు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ముఖ్యంగా హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట, సిరిసిల్ల మరియు నల్గొండ జిల్లాలలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ స్పష్టం చేసింది. భారీ వర్షాలు నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కూడా సూచనలు చేసింది హైదరాబాద్ వాతావరణ శాఖ. అటు భారీ వర్షాల నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ మెదక్‌ టూర్‌ కూడా వాయిదా పడిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news