తెలంగాణలో మరో 5 రోజులపాటు భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలెర్ట్

-

telangana rains on may 10th: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చల్లటి కబురు. తెలంగాణ రాష్ట్రంలో మరో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ స్పష్టం చేసింది. గత కొన్ని రోజులుగా ఎండలు విపరీతంగా దంచి కొడుతున్న నేపథ్యంలో ఈ వార్త కాస్త ఉపశమనం ఇచ్చింది.

telangana rains on may 10th

ఇవాళ అదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, సిద్దిపేట, హైదరాబాద్, మెదక్, కామారెడ్డి, వనపర్తి జిల్లాలలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఈ జిల్లాలో ఉరుములు మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయంటూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. కాబట్టి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కోరింది. హైదరాబాదులో కూడా భారీ వర్షం ఇవాళ పడే అవకాశాలు ఉన్నట్లు స్పష్టం చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news