రాజ్యాంగం మార్చాలన్న బీజేపీ కుట్రకు కేసీఆర్ వంత పాడారు- రేవంత్ రెడ్డి.

-

రాజ్యాంగం మార్చాలన్న బీజేపీ కుట్రకు కేసీఆర్ వంత పాడారని…రాజ్యాంగం రద్దు చేయాలని బిజెపి ఎన్నో ఏళ్లుగా కుట్ర చేస్తుందని.. కేసీఆర్ ను ముందుంచి రాజ్యాంగం రద్దు అంశాన్ని తెరమీడికి తెచ్చారని..బిజెపి రాజ్యాంగం రద్దు కుట్రకు కేసీఆర్ మద్దతు తెలిపారని టీపీపీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్ ప్రెస్ మీట్ లో మర్యాదగా వ్యవహరించలేదని ఆయన అన్నారు. మోడీ పై యుద్ధం ప్రకటిస్తారని ఆశించాం కానీ.. నిర్మలా సీతారామన్, మోడీ గురించి నీచంగా,జుగుప్సాకరంగా కేసీఆర్ మాట్లాడారని అన్నారు. భూస్వాములు,అగ్ర వర్ణాల కోసం రాజ్యాంగాన్ని మార్చాలన్న బిజెపి మాటలను కేసీఆర్ మాట్లాడినట్లు ఉందని విమర్శించారు. కేంద్ర బడ్జెట్ గంటన్నర ఉంటే కేసీఆర్ రెండున్నర గంటలు ఏక పత్రాభినయం చేసారని విమర్శించారు. సీఎం కల్తీ మందు తాగి వచ్చినట్లు మాట్లాడారని అన్నారు. విభజన చట్టం అంశాలు, కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన విశ్వవిద్యాలయం, ఎన్టీపీసీ యూనిట్ ,రైల్వే లైన్లు, జాతీయ రహదారుల విషయం ఏదీ మాట్లాడలేదని విమర్శించారు. కేసీఆర్ అసదుద్దీన్ ఓవైసీ సుపారీ గ్యాంగ్ అని.. యూపీలో బీజేపీని గెలిపించేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఓట్లు చీల్చడానికి ఎంఐఎం పోటీ చేస్తుందని ఆయన ఆరోపించారు.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అసభ్యకరమైన భాష మాట్లాడారని.. కేసీఆర్ భాషను ఖండిస్తున్నామని అన్నారు. ప్రధాన మంత్రిని ఉద్దేశించి ముఖ్యమంత్రి అసభ్యంగా మాట్లాడితే తెలంగాణ పరువు ఏం కావాలని.. మహిళలను గౌరవించే సంస్కృతి భారత సంస్కృతి అని .. కేసీఆర్ భాషను సభ్య సమాజం క్షమించదని రేవంత్ రెడ్డి అన్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version