నేటి నుంచి హైదరాబాద్‌ రోడ్లపై ఈవీ బస్సులు

-

పర్యావరణానికి ముప్పు కలిగించకుండా.. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా తెలంగాణ ఆర్టీసీ చర్యలు చేపట్టింది. తాజాగా పర్యావరణానికి మేలు కలిగించేలా హైదరాబాద్‌లో కొత్త ఏసీ బస్సులు ప్రవేశపెట్టనుంది. ఇవాళ్టి నుంచి గ్రీన్ మెట్రో ల‌గ్జరీ ఏసీ బ‌స్సులు భాగ్యనగర రహదారులపై రయ్ రయ్ మంటూ పరుగు పెట్టనున్నాయి.

గ్రీన్ మెట్రో లగ్జరీ ఏసీ బస్సులను రాష్ట్ర ర‌వాణా శాఖ మంత్రి పువ్వాడ అజ‌య్ కుమార్ హైదరాబాద్​లోని గ‌చ్చిబౌలి స్టేడియం వద్ద ఇవాళ ప్రారంభించ‌నున్నారు. ఈ ఎలక్ట్రిక్ బస్సులు కాలుష్యని వారణ సహా ప్రజలకు మెరుగైన, సౌకర్యవంత ప్రయాణ అనుభూతిని కలిగించ‌నున్నాయ‌ని ఆర్టీసీ అంటోంది. మొత్తం 50 గ్రీన్ మెట్రో ల‌గ్జరీ ఏసీ స‌ర్వీసుల్లో తొలి విడ‌త‌గా 25 బ‌స్సులు అందుబాటులోకి వస్తున్నాయని ఆర్టీసీ అధికారులు తెలిపారు. మిగిలిన 25 బ‌స్సులు న‌వంబ‌రు వరకు అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు. ఒక్కసారి ఛార్జీంగ్ చేస్తే 225 కిలోమీట‌ర్లు ప్రయాణించే సౌల‌భ్యం ఉంటుందని వివరించారు.

3 గంట‌ల‌ నుంచి 4 గంటల్లోపు పూర్తి ఛార్జింగ్ అవుతాయని అధికారులు తెలిపారు. 35 సీట్ల సామర్ధ్యం ఉన్న ఆ ఏసీ బస్సులో అత్యాధునిక సౌకర్యాలు కల్పించామని.. ప్రతి సీటు వద్ద మొబైల్ ఛార్జింగ్‌, రీడింగ్‌ ల్యాంప్‌తోపాటు పానిక్‌ బటన్‌ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రతిబస్సులో రెండు సీసీకెమెరాలు ఏర్పాటుచేసిన ఆర్టీసీ ఒక నెల రికార్డింగ్‌ బ్యాకప్‌ ఉంటుందని తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news