మానవీయ కోణంలో తెలంగాణను ఆదుకోవాలి : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

-

తెలంగాణ లో ఇటీవల భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. అయితే ఈ వర్షాలకు రాష్ట్రంలో పలు జిల్లాల్లో వరద ఏరులై పారడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. కొంత మంది మరణించారు. పశువులు, మేకలు, గొర్లు, బర్రెలు వరదల్లో కొట్టుకుపోయాయి. ఇండ్లు కూలిపోయాయి. ఇలా చాలా నష్టం జరిగింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం కేంద్రం నుంచి ఆర్థిక సహాయం ఇవ్వాలని కోరింది.

రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కేంద్ర బృందం వరద నష్టం పై చర్యలు చేశారు. ఇటీవలే కాలంలో సంభవించిన వరదలకు తెలంగాణ రాష్ట్రం తీవ్ర స్థాయిలో నష్టపోయిందని తెలిపారు మంత్రి పొంగులేటి. భారీ వర్షాలకు ప్రధాన రహదారులు, కాలనీలు జలమయం అయ్యాయి. పలు ఇళ్లు నీటిలో మునిగిపోయి ప్రజలు నిరాశ్రయులయ్యారని పేర్కొన్నారు. ఇల్లు, పంటలు నష్టపోయి ఆర్థికంగా నష్టపోయారు. అన్నీ కోల్పొయి కట్టుబట్టలతో మిగిలిన బాధితులకు మానవీయ కోణంలో కేంద్రం పెద్ద మొత్తంలో సాయం చేసి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు మంత్రి పొంగులేటి.

Read more RELATED
Recommended to you

Latest news