వర్షాలు, వరదలు వస్తాయని వాతావరణ శాఖ అలెర్ట్ చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు మాజీ సీఎం జగన్. తాజాగా ఆయన పిఠాపురంలో మీడియాతో మాట్లాడారు. అబద్దాలు చెప్పడంలో గోబెల్స్ కు చంద్రబాబు తమ్ముడు వరుస అవుతాడన్నారు. ఇది మ్యాన్ మేన్ ప్లడ్ అన్నారు. ఇది ఏ మాత్రం బాధ్యత లేని ప్రభుత్వం అన్నారు. విజయవాడలో ఉన్న నిర్లక్ష్యం ఏలేరులో కనిపిస్తోంది. ఏలేరు రిజర్వాయర్ కి వచ్చే ఇన్ ఫ్లో ను ఎందుకు కంట్రోల్ చేయలేదని ప్రశ్నించారు.
2008 నుంచి 2023 వరకు కూడా మాడ్యులేషన్ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. వరదలను ఎలా మేనేజ్ చేయాలో ఈ ప్రభుత్వానికి తెలియడం లేదు. చంద్రబాబు 2014-2023 పీరియడ్ మోడలైజేషన్ ఎందుకు చేయలేదన్నారు. చంద్రబాబు నాయుడు అబద్దాలు ఆడటం ధర్మమేనా..? అని అడుగుతున్నాను. చంద్రబాబుకు మానవత విలువలుంటే ఒక స్పెషల్ ఆఫీసర్ ను నియమిస్తారని పేర్కొన్నారు. విజయవాడలో వరదలు వచ్చినా జగన్, ఏలేరులో వరదలు వచ్చినా దానికి కారణం జగన్. జగన్ నామం కాదు.. చేయాల్సింది రాష్ట్ర ప్రజలకు న్యాయంగా, ధర్మంగా ఇవ్వాల్సింది ఇచ్చేయ్యాలన్నరు.