సింగరేణి ఎన్నికల 2023 షెడ్యూల్ ఇదే

-

ఎట్టకేలకు తెలంగాణ సింగరేణి సంస్థలో ఎన్నికల సైరన్‌ మోగింది. సింగరేణి కాలరీస్ సంస్థ గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలను వచ్చే నెల 28వ తేదీన నిర్వహించనున్నారు. ఈ క్రమంలో ఎన్నికల అధికారి, కేంద్ర కార్మిక శాఖ డిప్యూటీ చీఫ్‌ లేబర్‌ కమిషనర్‌ డి.శ్రీనివాసులు ఎన్నికల షెడ్యూలు విడుదల చేశారు. అదే రోజు ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలు ప్రకటిస్తామని వెల్లడించారు.

Telangana government sweet talk for Singareni workers

సింగరేణి సంస్థ ఎన్నికల షెడ్యూల్ వివరాలు.. 

  • ముసాయిదా ఓటర్ల జాబితాను ఈ నెల 30వ తేదీన కార్మిక సంఘాలకు, యాజమాన్యానికి అందజేస్తారు.
  • వచ్చే నెల 3వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు.
  • అక్టోబర్ 5వ తేదీన ఓటర్ల తుది జాబితా ప్రదర్శిస్తారు.
  • వచ్చే నెల 6వ తేదీ ఉదయం 10 నుంచి 7వ తేదీ సాయంత్రం 5 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు.
  • అక్టోబర్ 9న ఉ. 10 నుంచి సా.5 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంది.
  • అర్హులైన అభ్యర్థులకు 10వ తేదీ మధ్యాహ్నం ఎన్నికల గుర్తులు కేటాయిస్తారు.
  • 28వ తేదీన ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్‌ జరుగుతుంది.
  • అదే రోజు రాత్రి 7 గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలు ప్రకటిస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news