తెలంగాణ పోలీసు శాఖలో మరో రెండు కొత్త బ్యూరోలు

-

తెలంగాణ పోలీస్‌ వ్యవస్థలో మరో రెండు కొత్త సంస్థలు ఆవిర్భవించాయి. సైబర్‌, డ్రగ్స్​కు సంబంధించిన నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో వీటిని అరికట్టేందుకు తెలంగాణ స్టేట్‌ యాంటీ నార్కోటిక్‌ బ్యూరో (టీఎస్‌న్యాబ్‌), తెలంగాణ స్టేట్‌ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో (టీఎస్‌సీఎస్‌బీ)లు ఏర్పాటయ్యాయి. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో ఏర్పాటుచేసిన ఈ బ్యూరోలను రాష్ట్ర హోం, ఆబ్కారీ శాఖల మంత్రులు మహమూద్‌ అలీ, వి.శ్రీనివాస్‌గౌడ్‌ బుధవారం ప్రారంభించారు. ఈ బ్యూరోల కోసం దాదాపు 600 మంది సిబ్బందిని కేటాయించారు.

సైబర్‌, మాదకద్రవ్యాల నేరాల నియంత్రణకు ఈ బ్యూరోల ద్వారా అడ్డుకట్ట పడుతుందని మంత్రి మహమూద్ అలీ అన్నారు. చట్టాలను కఠినంగా అమలు చేయడం ద్వారానే ఈ నేరాల నియంత్రణ సాధ్యమవుతుందని తెలిపారు. బ్లాక్‌మెయిల్‌ చేసి ఆత్మహత్యలకు ప్రేరేపించే సైబర్‌ నేరగాళ్లపై హత్యకేసు నమోదు చేయాల్సిన అవసరం ఉందన్నారు. కొత్తగా ఏర్పాటైన బ్యూరోల పనితీరు నేరగాళ్లలో భయం పుట్టించాలని సూచించారు. కేసుల దర్యాప్తు ఎంతో సవాల్‌తో కూడుకున్నదని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కొత్త బ్యూరోలు ఆ సమస్యల్ని అధిగమిస్తాయని డీజీపీ అంజనీకుమార్‌ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version